News October 8, 2025

HYD: 8 ఏళ్లు.. రూ.134.41 కోట్లు!

image

భూమి బంగారం అంటారు. అదే మన HYDలో వజ్రాన్ని మించిపోయింది. రాయదుర్గంలో ఎకరం భూమి రూ.177 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. 2017లో ఎకరం రూ.42.59 కోట్లు ఉండేది. 8 ఏళ్ల కాలంలో ఏకంగా రూ.134.41 కోట్లకు పెరగడం విశేషం. దేశంలోనే గరిష్ఠ ధరకు ఎకరం భూమి అమ్ముడుపోయింది మన రాయదుర్గంలోనే. ఇక్కడ భవనాలే కాదు భూముల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ధరలు ఈ స్థాయిలో ఉంటే మధ్య తరగతి ప్రజల సొంతింటి కల కలగానే మిగలనుంది.

Similar News

News March 4, 2026

HYDలో కొత్త ట్రెండ్.. ‘పిక్సెల్’ షికారీలు

image

HYD GEN Z ఖరీదైన ఐఫోన్ ఫొటోల కంటే పాత కాలపు ‘డిజిటల్ కెమెరాల’ కోసం జుమ్మెరాత్ బజార్‌ను జల్లెడ పడుతున్నారు. ఆ ‘గ్రెయిన్’, ఆ ‘బ్లర్’ ఇమేజ్‌లే ఇప్పుడు SMలో అసలైన కిక్కు. ఎడిటింగ్ లేని పచ్చి నిజం లాంటి ఫొటోల కోసం ఈ కుర్రాళ్లు అర్ధరాత్రి పూట మోజంజాహీ మార్కెట్ శిథిలాల వెనుక తిరుగుతున్నారు. గతాన్ని ఫిల్టర్ లేకుండా చూపించడమే వీరి జీవనశైలి. ఈ ‘పిక్సెల్ షికారీలు’ సరికొత్త ఆర్ట్ ఫామ్‌ను సృష్టిస్తున్నారు.

News March 4, 2026

నియోపోలిస్ భూమి ‘యూ-టర్న్’.. సర్కారు వెనకడుగు!

image

కోకాపేటలో రిజర్వాయర్ల కోసం కేటాయించిన 3.95 ఎకరాల విషయంలో సర్కారు అడ్డంగా దొరికిపోయింది. శారదా పీఠం భూములను HMWSSBకి ఇస్తూ FEB 28న GO ఇచ్చారు. పీఠం రిప్రజెంట్లు CMను కలవడంతో ఆ భూ కేటాయింపు రద్దయింది. 592మీటర్ల ఎత్తు నుంచి సప్లై చేస్తేనే పాతబస్తీ, మెహదీపట్నంకు కరెంట్ ఖర్చు లేకుండా నీళ్లు వెళ్తాయి. ఇప్పుడు ఆ స్థలం పోవడంతో ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.వందల కోట్లు పెరుగుతుందన్నది గ్రౌండ్ రిపోర్ట్.

News March 4, 2026

HYD: మెట్రో హంగులకు ఇక గుడ్-బై!

image

L&T చేతిలో ఉన్న HYD మెట్రో ఫేజ్-1 ఇక పక్కా ప్రభుత్వ ఆస్తి కాబోతోంది. MAR 31 నాటికి అప్పగింత పూర్తి కావాల్సిందేనని CS నుంచి డెడ్ లైన్ వచ్చింది. సుమారు రూ.15,000 కోట్ల భారీ డీల్ ఇది. ఈ డబ్బు కోసం ప్రభుత్వం ఇప్పుడు IRFC దగ్గర తక్కువ వడ్డీకి అప్పు కోసం తిరుగుతోంది. ప్రభుత్వ మెట్రోలో సామాన్యుడికి టికెట్ ధరలు తగ్గుతాయా?, కనీస మెయింటెనెన్స్ లేక మెట్రో ‘ఆర్టీసీ’లా మారుతుందా? అని జనం టెన్షన్ పడుతున్నారు.