News February 3, 2025
HYD: 8.5 లక్షల కనెక్షన్లకు ఉచిత నీటి పథకం

జలమండలి పరిధిలో 13.7 లక్షల నీటి కనెక్షన్లు ఉండగా.. వీటిలో 8.5 లక్షలు కనెక్షన్లు ఉచిత నీటి పథకంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ HYDలో అర్హులైన వారందరికీ ఉచిత నీటి పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఎవరికైనా అమలు కాకుంటే స్థానికంగా ఉన్న వాటర్ బోర్డుకు సంబంధించిన జనరల్ మేనేజర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News November 24, 2025
పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్బస్టర్!

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.
News November 24, 2025
స్మృతి పెళ్లి వాయిదా.. మరో బిగ్ ట్విస్ట్!

స్మృతి మంధాన పెళ్లి వేళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు పెళ్లి వేడుకకు సంబంధించి SMలో పోస్ట్ చేసిన ఫొటోలను స్మృతి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఇన్స్టాలో ఆ ఫొటోలు, వీడియోలేమీ కనిపించడంలేదు. దీంతో అసలేం జరుగుతుందో తెలియక ఆమె అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. నిన్న వివాహం జరగడానికి ముందు ఆమె తండ్రికి గుండెపోటు రాగా తర్వాత కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ అనారోగ్యానికి గురయ్యారు.
News November 24, 2025
అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.


