News May 25, 2024
HYD: 80 ఏళ్ల వయసులోనూ సత్తాచాటిన MLA తండ్రి

ప్రస్తుత యాంత్రీకరణ యుగంలో నడవడం, పరిగెత్తడం, ఈత కొట్టడం అంటేనే అదొక పెద్ద కష్టంగా భావిస్తున్నారు. అలాంటి 80 ఏళ్ల వయసులోనూ మల్కాజిగిరి MLA రాజశేఖర్ రెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డి ఈత కొట్టడంలో సత్తాచాటారు. 200 మీటర్ల ఫ్రీ స్టైల్ 9.01 నిమిషాల్లో, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ 3.53 నిమిషాల్లో పూర్తి చేసి పాన్ ఇండియా మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తొలి స్థానం కైవసం చేసుకున్నారు.
Similar News
News December 5, 2025
HYD: ‘వాక్ టు వర్క్’ అంటే తెలుసా?

BFCలో భాగంగా ‘వాక్ టు వర్క్’(WTW)ను ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈ ప్రత్యేక ప్రణాళిక కింద నివాస ప్రాంతాలకు ఆఫీసులు, విద్యాసంస్థలు దగ్గరగా ఉండేలా డిజైన్ చేస్తారు. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు కాలుష్యం, ట్రాఫిక్ జామ్ను తప్పించుకుని స్కూళ్లు, ఆఫీసుల నుంచి ఇంటికి బై వాక్ వెళ్లొచ్చు. తద్వారా కార్బన్ ఉద్గారాలు, పొల్యూషన్ గణనీయంగా తగ్గి ‘నెట్-జీరో సిటీ’ లక్ష్యాన్ని సాధించడానికి <<18479244>>WTW<<>> కీలకమవుతుంది.
News December 5, 2025
TG కోసం శ్రీకాంత చారి.. BCల కోసం ఈశ్వర చారి!

తెలంగాణ నేలపై ఉద్యమ జ్వాల ఎప్పటికీ చల్లారదు. హక్కుల కోసం ప్రాణాలు పణంగా పెట్టే సాహసమే ఈ మట్టి మనుషుల స్వభావం. 2009లో ప్రత్యేక తెలంగాణ కోసం శ్రీకాంత చారి చేసిన ఆత్మాహుతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. అదే జ్వాల మళ్లీ రాజుకుంది. BCలకు జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహంతో కూకట్పల్లికి చెందిన సాయి ఈశ్వర చారి గురువారం తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాడు.*హక్కుల కోసం ఆత్మహత్య చేసుకోవద్దు.. బతికి సాధించాలి.
News December 5, 2025
అసలేంటీ భారత్ ఫ్యూచర్ సిటీ?

TG టౌన్ ప్లానింగ్, ఆర్థికాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచే ఒక సాహసోపేతమైన అధ్యాయమే ఫ్యూచర్ సిటీ. ఫార్మా సిటీ, RRR, IT కారిడార్ల మధ్య వ్యూహాత్మకంగా 30K ఎకరాల విస్తీర్ణంలో నూతన నగరాన్ని(BFC) నిర్మించనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గమనం, జీవన ప్రమాణాలను సమూలంగా మార్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ సిటీలో ‘వాక్ టు వర్క్’ అనే విప్లవాత్మక కాన్సెప్ట్ హైలైట్ కానుంది.


