News February 22, 2026
HYD: 80% సబ్సిడీతో ఈ-స్కూటర్లు

మైనారిటీ యువత ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ-స్కూటర్స్ పంపిణీ పథకం అమలు చేస్తున్నట్లు RR జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ- స్కూటర్ యూనిట్ వ్యయం సుమారు రూ.1.50 లక్షలు కాగా అందులో 80% సబ్సిడి ( రూ.1.20 లక్షలు) ప్రభుత్వం అందిస్తుందని మిగిలిన 20%(రూ.30,000) లబ్ధిదారుడి వాటా కింద చెల్లించాలన్నారు.
# SHARE IT
Similar News
News February 26, 2026
ములుగు: నేటి నుంచి ఇంటర్ సెకెండియర్ పరీక్షలు

ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు జిల్లాలో 1860 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారిలో 1632 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 228 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి.
News February 26, 2026
కర్నూలు: ఒకే ఒక్క పోస్టుకు నోటిఫికేషన్ విడుదల

కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని న్యాయవాదులకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. క్రిమినల్ లా ప్రాక్టీస్‌లో కనీసం 7 ఏళ్ల అనుభవం, సెషన్స్ కేసులు నిర్వహించిన వారు అర్హులన్నారు. మార్చి 10 నాటికి దరఖాస్తులు కార్యదర్శి కార్యాలయంలో ఇవ్వాలన్నారు.
News February 26, 2026
కాకినాడ: రూ.53కు ఫుడ్ ఆర్డర్.. రూ.5 లక్షలు మాయం!

తక్కువ ధరకే ఆహారం ఆర్డర్ చేసిన ఓ వృద్ధుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. రామారావుపేటకు చెందిన హనుమంతరావు(77) రూ.53 ఫుడ్ ఆర్డర్‌కు డెలివరీ బాయ్ రూ.111 వసూలు చేయడంతో నిలదీశారు. అతను ఇచ్చిన కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేయగా, ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఆయన ఖాతా నుంచి సైబర్ కిలాడీలు రూ.5 లక్షలకు పైగా కాజేశారు. దీనిపై బాధితుడు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


