News April 8, 2025

HYD: 82KM రైల్వే ప్రాజెక్టులో మన రైల్వే స్టేషన్లు..!

image

MMTS ప్రాజెక్టులో 82KM మేర 6 లైన్లను చేర్చినట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో ఘట్కేసర్- మౌలాలి క్వాడ్రిపులింగ్ (12 కి.మీ), తెల్లాపూర్- రామచంద్రాపురం కొత్త లైన్ (5 కి.మీ), మేడ్చల్- బొల్లారం డబ్లింగ్ (14 కి.మీ), ఫలక్నుమా- ఉమ్దనగర్ డబ్లింగ్ (1.4 కి.మీ), సనత్‌నగర్- మౌలాలి బైపాస్ డబ్లింగ్ (22 కి.మీ), సికింద్రాబాద్- బొల్లారం విద్యుద్ధీకరణ (15 కి.మీ) పనులు ఉన్నాయన్నారు.

Similar News

News November 27, 2025

కామారెడ్డి జిల్లాలో తొలిరోజు 210 నామినేషన్లు

image

కామారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని 167 గ్రామ పంచాయతీల్లో (1,520 వార్డులకు) ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచి స్థానాలకు 115 నామినేషన్లు రాగా, వార్డు సభ్యుల స్థానాలకు 95 నామినేషన్లు వచ్చాయి. తొలిరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్దగా ముందుకు రాలేదు.

News November 27, 2025

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రమును కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్ వీడియోగ్రఫీ పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు.

News November 27, 2025

అనంతపురం జిల్లాలో దారుణం

image

అనంతపురం శారదానగర్‌లో గురువారం దారుణం చోటు చేసుకుంది. రామగిరి డిప్యూటీ తహశీల్దార్ భార్య అమూల్య తన 3 ఏళ్ల కుమారుడు సహస్రను గొంతు కోసి, తాను ఉరి వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఇరువురు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.