News May 4, 2024
HYD: 852 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు..

హైదరాబాద్‌లో మొదటి రోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ అధికారులు సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి జిల్లాలో మొత్తం మొదటి రోజున 852 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Similar News
News October 25, 2025
HYD: మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా.. జర జాగ్రత్త..!

ఓ మహిళ మంటల్లో కాలిపోయిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD సరూర్‌నగర్ PS పరిధి త్యాగరాయనగర్ కాలనీలోని MSR రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ 302లో మాధవి(45) నివాసం ఉంటుంది. ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత బయటకు వెళ్లిన మాధవి కొద్దిసేపు తర్వాత తిరిగొచ్చి వెలిగించింది. దీంతో మంటలు అంటుకుని ఆమె ఆర్తనాదాలు చేస్తూ చనిపోయింది. కేసు నమోదైంది. జర జాగ్రత్త..!
News October 25, 2025
HYD: BRS నేత సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదు

BRSనేత సల్మాన్ ఖాన్‌పై బంజారాహిల్స్ PSలో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బోరబండ వాసి సల్మాన్‌ఖాన్ HYCపార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు.స్క్రూటినీ సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్వో సాయిరాంపై అతడు అనుచిత వ్యాఖ్యలు చేయగా కేసు నమోదైంది. కాగా ఇటీవల అతడు BRSలో చేరిన విషయం తెలిసిందే.
News October 25, 2025
TARGET జూబ్లీహిల్స్..!

జూబ్లీహిల్స్‌లో నామినేషన్ ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం రాజకీయం మరింత వేడెక్కింది. ఇక్కడ గెలిచిన పార్టీకే తర్వాత TGలో వచ్చే అన్ని ఎలక్షన్లలో హవా ఉంటుందనే చర్చ జోరుగా సాగడంతో కాంగ్రెస్, BRS, BJPకి ఇప్పుడు జూబ్లీహిల్స్ టార్గెట్‌గా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున స్టేడ్ బడా లీడర్లంతా రంగంలోకి దిగి ప్రచారం చేస్తుండగా ఇతర జిల్లాల నుంచి ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు సైతం వస్తున్నారు.


