News August 18, 2024
HYD: 87126 71111 ఈ నంబర్ సేవ్ చేసుకోండి: డీజీపీ

విద్యాసంస్థల్లో డ్రగ్స్, ర్యాగింగ్ అరికట్టడానికి పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ HYDలో అన్నారు. తెలంగాణలో ర్యాగింగ్‌ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాంటీ నార్కోటెక్ తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. డ్రగ్స్, ర్యాగింగ్ పై 87126 71111 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని, ఈ నంబర్ సేవ్ చేసుకోవాలన్నారు.
Similar News
News November 7, 2025
జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.
News November 7, 2025
HYD: ట్రబుల్ షూటర్ వచ్చేస్తున్నారు!

పితృవియోగంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు మళ్లీ యుద్ధరంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు దగ్గర పడుతుండడంతో, ట్రబుల్ షూటర్‌గా ఆయన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. BRS జైత్రయాత్రను జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టేందుకు, హరీశ్ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
News November 7, 2025
HYD మెట్రో ఛార్జీల పెంపు.. అదంతా FAKE

HYD మెట్రో రైలు ఛార్జీల పెంపుపై వస్తున్న వార్తలపై IPR అసిస్టెంట్ డైరెక్టర్ జాకబ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎలాంటి ఛార్జీల సవరణ లేదని తెలిపారు. మెట్రో రైల్వేస్ (O&M) చట్టం- 2002 ప్రకారం, ఛార్జీలు నిర్ణయించే బాధ్యత మెట్రో రైల్వే అడ్మినిస్ట్రేషన్ (MRA)కి ఉంటుంది. ఈ నిర్ణయం FFC సిఫార్సుల ఆధారంగా మాత్రమే తీసుకుంటారని పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న ఛార్జీల పెంపు వార్తలు నిరాధారమన్నారు.


