News January 4, 2025
HYD: 9 లక్షల పాస్ పోర్ట్ దరఖాస్తులు

HYD: తెలంగాణ వ్యాప్తంగా 5 పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు,14 పోస్టల్ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నమని హైదారాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ అధికారి స్నేహజ అన్నారు. 2024 ఏడాదికి గాను 9లక్షల మేర పాస్ పోర్ట్ దరఖాస్తులు స్వీకరించామన్నారు. నాటి పరిస్థితులు మార్చుతూ 6 రోజుల్లో అపాయింట్ మెంట్ అందేలా ఏర్పాటు చేశామన్నారు. వారం రోజుల్లో సాధరణ పాస్ పోర్ట్, రెండు రోజుల్లో తత్కాల్ పాస్ పోర్ట్ అందిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News October 24, 2025
ఓయూ: MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.
News October 24, 2025
ఓయూలో వాయిదా పడిన కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎమ్మెస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
News October 24, 2025
HYD: సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం ₹12.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. హైదరాబాద్లో ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరిట వందల మందిని సాహితీ ఇన్ఫ్రా సంస్థ మోసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ పూర్ణచందరరావు, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మొత్తం ₹126 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ విచారణలో తేలింది.


