News January 4, 2025

HYD: 9 లక్షల పాస్ పోర్ట్ దరఖాస్తులు

image

HYD: తెలంగాణ వ్యాప్తంగా 5 పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు,14 పోస్టల్ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నమని హైదారాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ అధికారి స్నేహజ అన్నారు. 2024 ఏడాదికి గాను 9లక్షల మేర పాస్ పోర్ట్ దరఖాస్తులు స్వీకరించామన్నారు. నాటి పరిస్థితులు మార్చుతూ 6 రోజుల్లో అపాయింట్ మెంట్ అందేలా ఏర్పాటు చేశామన్నారు. వారం రోజుల్లో సాధరణ పాస్ పోర్ట్, రెండు రోజుల్లో తత్కాల్ పాస్ పోర్ట్ అందిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News January 2, 2026

HYDలో ఎన్నికలు ఎప్పుడంటే?

image

గ్రేటర్ HYDను మూడు భాగాలు చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం వాటికి ఎన్నికలు కూడా నిర్వహించనుంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను అధికారికంగా ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనేదానిపై కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఎండా కాలం ముగిసిన తర్వాతే అంటే జూన్ తర్వాత ‘గ్రేటర్’ ఎలక్షన్స్ ఉండవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుత కౌన్సిల్ గడువు వచ్చేనెల 10వరకు ఉంది.

News January 1, 2026

HYDలో కొత్త ట్రెండ్.. ఇదే బెస్ట్ స్పాట్..!

image

HYD‌లో ఏ వేడుక జరిగినా ఇప్పుడు అందరి చూపు డాక్టర్‌ బీ.ఆర్. అంబేడ్కర్ సెక్రటేరియట్ వైపే ఉంటోంది. IPL‌లో RCB విజయం, న్యూ ఇయర్ వేడుకలను సీపీ సజ్జనార్ ఇక్కడే జరుపుకోవటం విశేషం. సెక్రటేరియట్ అద్భుతమైన నిర్మాణ శైలి, విద్యుత్ వెలుగులతో ఈ ప్రాంతం పర్యాటకానికి ‘బెస్ట్ స్పాట్’గా మారింది. అమరజ్యోతి, భారీ అంబేడ్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు.

News January 1, 2026

BREAKING.. RR: గురునానక్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

image

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. కాలేజీ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థి రాము (20) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురునానక్ కాలేజీలో రాము బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.