News February 18, 2025

HYD: 90% మంది సొంత స్థలం లేనివారే..!

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా సొంతింటికి దరఖాస్తు చేసుకున్న వారిలో 90 % మంది సొంత స్థలం లేని వారే ఉన్నట్లు పరిశీలనలో అధికారులు గుర్తించారు. తొలిదశలో సొంత స్థలం ఉన్న వారికి అర్హులుగా గుర్తించి, ఇంటి నిర్మాణానికి అందించాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సర్వే మొత్తం పూర్తైన తర్వాత ఇందిరమ్మ కమిటీల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక జరగనుంది.

Similar News

News December 6, 2025

చాలా సమస్యలు పాక్ నుంచే వస్తాయి: జైశంకర్

image

పాక్ <<18473435>>CDFగా<<>> ఆసిమ్‌ మునీర్‌ నియామకంపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. పాక్ ఆర్మీ ఇప్పటికీ అలానే ఉందని, తమకు చాలా సమస్యలు అక్కడి నుంచే వస్తాయని చెప్పారు. ‘మంచి టెర్రరిస్టులు, చెడ్డ టెర్రరిస్టులు ఉన్నట్లే.. మంచి మిలిటరీ లీడర్లు, అంత మంచివాళ్లు కాని లీడర్లు ఉన్నారు. పాక్‌‌‌ను పెద్దగా పట్టించుకోకూడదు. కొన్ని సమస్యలు ఉన్నమాట నిజమే. వాటిని పరిష్కరిస్తాం’ అని HT లీడర్‌షిప్ సమ్మిట్‌లో చెప్పారు.

News December 6, 2025

రేపు కొమురవెల్లి మల్లన్న మూలవిరాట్ దర్శనం నిలిపివేత

image

శ్రీ మల్లన్న దేవాలయంలో డిసెంబర్ 7 సాయంత్రం 8.30 గంటల నుంచి డిసెంబర్ 14 ఉదయం 6 గంటల వరకు మూలవిరాట్ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. డిసెంబర్ 14న కల్యాణోత్సవం నేపథ్యంలో ఈ అలంకరణ పనులు జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థం అర్ధ మండపంలో ఉత్సవ మూర్తుల దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈఓ వెల్లడించారు.

News December 6, 2025

బోయకొండ గంగమ్మ భక్తులకు గమనిక

image

బోయకొండ గంగమ్మ ఆలయంలో శాశ్వత నిత్యార్చన సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఈవో ఏకాంబరం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారుల ఆదేశాలతో సంక్రాంతి నుంచి అమ్మవారికి శాశ్వత నిత్యార్చన నిర్వహిస్తామని చెప్పారు. ఏడాదికి రూ.10,116, 6నెలలకు రూ.7,116, 3నెలలకు రూ.5,116, నెలకు రూ.2,116తో సేవా టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కుంకుమార్చన రూ.101, వడి బాల సేవ రూ.201తో నూతన సేవలు ప్రవేశ పెడతామన్నారు.