News February 18, 2025
HYD: 90% మంది సొంత స్థలం లేనివారే..!

గ్రేటర్ HYD వ్యాప్తంగా సొంతింటికి దరఖాస్తు చేసుకున్న వారిలో 90 % మంది సొంత స్థలం లేని వారే ఉన్నట్లు పరిశీలనలో అధికారులు గుర్తించారు. తొలిదశలో సొంత స్థలం ఉన్న వారికి అర్హులుగా గుర్తించి, ఇంటి నిర్మాణానికి అందించాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సర్వే మొత్తం పూర్తైన తర్వాత ఇందిరమ్మ కమిటీల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక జరగనుంది.
Similar News
News March 26, 2025
అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

TG: సంచలనం రేపిన <<10880696>>అప్సర<<>> హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆమెను హత్య చేసిన నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవితఖైదు విధించింది. కొన్నేళ్లుగా అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం నడిపిన సాయికృష్ణ 2023లో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేసి, అప్సర కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టగా సాయికృష్ణే నిందితుడని తేలింది.
News March 26, 2025
అడుగుకు ‘రూపాయి పావలా’ కమీషన్ వసూలు: YCP

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ మరోసారి సంచలన ఆరోపణ చేసింది. ‘నిన్న మొన్నటివరకు చికెన్ షాప్‌ల మీద పడి దండుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పుడు పొగాకు గోదాములను కూడా వదలడం లేదు. అడుగుకు ‘రూపాయి పావలా’ చొప్పున తనకు రౌడీ మాములు ఇస్తే తప్ప అక్కడ పొగాకు నిల్వ చేయనివ్వమని హెచ్చరించారు. ఎమ్మెల్యే దిగజారుడుతనం చూసి వ్యాపారులు భీతిల్లుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.
News March 26, 2025
రామ్ చరణ్ అభిమానులకు సూపర్ న్యూస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ సినిమా నుంచి అప్డేట్ రానుంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. రేపు చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ వీడియో వచ్చే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.