News February 12, 2025
HYD: 9000113667 ఈ నంబర్‌కు కాల్ చేయండి..!

చెరువుల్లో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబర్‌ను 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. ఇప్పటి వరకు 48 కేసులు కాగా రాత్రీపగలు నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకున్నామని తెలిపింది.
Similar News
News September 13, 2025
KNR: సమగ్ర శిక్ష వ్యాయమ జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్

సమగ్ర శిక్ష వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వంగ ప్రకాష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సొల్లు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా రజితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వంగ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారికి వ్యాయామ ఉపాధ్యాయులు శుభాకాంక్షలు చెప్పారు.
News September 13, 2025
కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి జిల్లా మీదుగా సంబల్‌పూర్ (SBP), ఈరోడ్(ED) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ SEPT 17 నుంచి NOV 26 వరకు ప్రతి బుధవారం SBP-ED(నం.08311), SEPT 19 నుంచి NOV 28 వరకు ప్రతి శుక్రవారం ED-SPB(నం.08312) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో కైకలూరు, గుడివాడ, విజయవాడలో ఆగుతాయన్నారు.
News September 13, 2025
సర్వదర్శనం టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. శనివారం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, సర్వదర్శనం టోకెన్ల కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ వద్ద భక్తులు బారులు తీరారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సర్వదర్శనం టోకెన్ల జారీ చేసే ప్రాంతం శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోయింది.