News July 25, 2024
HYD: 9999 నెంబర్ ప్లేట్‌కు అక్షరాల రూ.19.51 లక్షలు

హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో జరిగిన వేలంలో ‘TG09A9999’ నంబర్ ఏకంగా రూ.19,51,111 పలికింది. హానర్స్ డెవలపర్స్ సంస్థ అంత మొత్తం చెల్లించి నంబరును సొంతం చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన ‘TG09 B’ సిరీస్‌లో ‘0001′ నంబరును రూ.8.25 లక్షలు చెల్లించి ఎన్‌జీ మైండ్ ఫ్రేమ్ సంస్థ దక్కించుకుందని జేటీసీ రమేశ్ తెలిపారు. ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.51,17,514 ఆదాయం సమకూరిందని వివరించారు.
Similar News
News December 8, 2025
ప్రపంచాన్ని ఏకం చేసేలా HYDలో సమ్మిట్

HYD శివారు మీర్‌ఖాన్‌పేట్ గ్లోబల్ సమ్మిట్‌కు వేదికైంది. 44కిపైగా దేశాలు, 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, గ్లోబల్ కంపెనీలు పాల్గొననున్న ఈ సమ్మిట్ మ.1:30కు ప్రారంభం కానుంది. నోబెల్ గ్రహీతలు అభిజిత్, కైలాష్ సత్యర్థి ప్రధాన వక్తలు. వీరిలో 46 మంది అమెరికా ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, అమెజాన్, ఐకియా తదితర ప్రతినిధులు ఉన్నారు. అంతేకాదు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ కంపెనీలు, ఇతర దేశాల రాయబారులు రానున్నారు.
News December 8, 2025
ఇక తెలంగాణ ‘ఫ్యూచర్’ మన HYD

నేటి నుంచే కందుకూరులో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇది ప్రపంచ ఆర్థిక సదస్సు ‘దావోస్’గా కార్యరూపం దాల్చింది. ఈ ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆహ్వానించింది. ఇప్పటికే బ్లాక్ క్యాట్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ అక్కడ పహారా కాస్తున్నాయి. ఈ సమ్మిట్‌తో ‘నిన్నటి వరకు ఒక లెక్క నేటి నుంచి మరో లెక్క’ అని సీఎం ధీమా వ్యక్తంచేశారు.
News December 8, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.


