News March 18, 2024
HYD: సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం
ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ DCM ఢీకొన్న ఘటన HYD శంషాబాద్ పరిధి తొండుపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. RR జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై అర్ధరాత్రి మేఘ్ రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో HYD- బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే DCM ఢీకొట్టింది. త్రుటిలో ప్రమాదం తప్పింది.
Similar News
News December 24, 2024
HYD: శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్న మేయర్
HYD సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి బేగంపేట కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, కళ్లు తెరిచి చూస్తున్నాడని, కానీ ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాడని డాక్టర్లు మేయర్‌కు వివరించారు. త్వరగా అతను కోలుకోవాలని మేయర్ ఆకాంక్షించారు.
News December 23, 2024
ట్రాన్స్‌జెండర్ నుంచి ట్రాఫిక్ పోలీస్.. ఆ కథ ఇదే!
మొన్నటి వరకు ట్రాన్స్‌జెండర్స్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. నేడు గౌరవ వృత్తిలోకి వచ్చారు. ఏకంగా ఖాకీ చొక్కా ధరించి, HYD ట్రాఫిక్ విధుల్లో ఉన్నారు. వీరిని ట్రాఫిక్ విధుల్లోకి తీసుకోవాలన్న ఆలోచన మాత్రం సీఎం రేవంత్ దే. వాహనంలో వెళ్లే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేయడం గమనించానని సీఎం ప్రకటించారు. ట్రాఫిక్‌పై పట్టు ఉండే వీరికి ట్రాఫిక్ జాబ్ ఇవ్వాలని ఆరోజే సీఎం భావించారట.
News December 22, 2024
HYD: ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫ్రీ..!
హైదరాబాద్‌లో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు విధానం అమలవుతోంది. జిల్లాలో దాదాపు 130 ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని రవాణా శాఖ తెలిపింది. రూ.25 లక్షలపై మినహాయింపు లభించినట్లుగా HYD జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్ వివరాలను వెల్లడించారు.