News May 22, 2024

HYD: ACP ఉమామహేశ్వరరావు అక్రమ ఆస్తుల వివరాలు

image

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఏసీపీ ఉమామహేశ్వరరావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహించి రూ. 3 కోట్ల ఆస్తులు, రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 40 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Similar News

News December 8, 2025

HYD: 2 రోజుల కోసం 2 నెలలుగా ప్రత్యేక దృష్టి

image

నేడు, రేపు ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి 2 నెలల ముందునుంచే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిత్యం సమీక్షలు, ఏర్పాట్లు, అతిథులు, ఆహ్వానాలు.. ఇలా అన్నింటిని తానే నడిపించారు. ఎక్కడా.. పొరపాట్లు దొర్లకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాహుల్ గాంధీని ఆహ్వానించారు. వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలనేది సీఎం ఆశయం.   

News December 8, 2025

సీఎం సరికొత్త ఆలోచన.. HYDలో డొనాల్డ్ ట్రంప్ రోడ్

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఇపుడు హైదరాబాద్‌లోని ఓ రోడ్డుకు పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సిటీలోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ వద్ద ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయాన్ని కేంద్రానికి, యూఎస్ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాయనున్నట్లు సమాచారం.

News December 8, 2025

HYDలో అక్కడ ఒక్క రూపాయికే టిఫిన్

image

HYDలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో భోజనం కోసం బిక్కు బిక్కుమంటూ తిరిగే వాళ్లెందరో. అలాంటి వారిని చూసి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ‘కరుణ కిచెన్’ జార్జ్ రాకేశ్‌బాబు రూపాయికే టిఫిన్ పెడుతున్నట్లు తెలిపారు. రోజూ మెనూ ఛేంజ్ చేస్తూ దాదాపు 300 మంది కడుపు నింపుతున్నారు. ఉ.7 గం.- 9 గం. వరకు 2 గంటలు కొనసాగుతోంది. ‘డబ్బు కోసం కాదు.. నలుగురి కడుపు నింపేందుకు. ఇందులోనే నా సంతోషం ఉంది’ అని తెలిపారు.