News February 24, 2025

HYD: AIతో 5 నిమిషాల్లో బిల్డింగ్ పర్మిషన్..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో భవనాల నిర్మాణానికి సంబంధించిన పర్మిషన్లు ఇచ్చేందుకు HMDA సిద్ధమవుతోంది. బిల్డ్ నౌ ఏఐ టెక్నాలజీ ద్వారా భవనాల అనుమతుల ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న TGBPASS ద్వారా 40 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇచ్చేందుకు 20-30 రోజుల సమయం పడుతుండగా, AI టెక్నాలజీతో కేవలం ఐదు నిమిషాల్లోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు.

Similar News

News February 24, 2025

HYD: మైనర్లపై అధికారుల నిఘా..!

image

మాదకద్రవ్యాలపైనే కాదు మైనర్లకు సిగరెట్ అమ్మకాలపైనా అధికారులు HYDలో నిఘా పెంచారు. దీనికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. ఇవి సెల్‌ఫోన్‌లతో పాటు సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీస్తుంటాయి. ఈ వీడియోల ఆధరాంగా వ్యాపారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందాలు కొనసాగుతాయిని ఆయన వెల్లడించారు.

News February 24, 2025

HYD: HICCలో బయో ఏషియా సదస్సు

image

జీవ విజ్ఞాన రంగంలోని పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒక వేదికపైకి తీసుకొచ్చే బయో ఏషియా సదస్సుకు రంగం సిద్ధమైంది. 22వ సదస్సు ఈ నెల 25, 26 తేదీల్లో HYDలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనుంది. 50 దేశాలకు చెందిన దాదాపు 3,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. CM రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా రేపు సదస్సు ప్రారంభం కానుంది.

News February 24, 2025

HYD: దాయాదుల మ్యాచ్.. భారీగా పందేలు

image

నిన్న దాయాదుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ సందర్భంగా రూ.కోట్లల్లో పందేలు సాగాయి. బంతిబంతికి రూ.2000-2500 వరకు పందేలు వేసుకున్నారు. చందానగర్, మాదాపూర్, ఎల్బీనగర్, గోషామహల్, చిలకలగూడ, ముషీరాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లో ఓ స్థిరాస్తి వ్యాపారి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వీటిని నిర్వహించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు నిఘా ఉంచారు.

error: Content is protected !!