News January 9, 2025

HYD: AIDS వచ్చిన వారిని వెలివేస్తే జైలు శిక్ష..!

image

HIV/AIDS వచ్చిన వారిపై ఉద్యోగ స్థలంలో వివక్ష చూపి, వెలివేస్తే చట్టపరకారంగా జైలు శిక్ష ఉంటుందని HYD, MDCL TGSACS అధికారులు హెచ్చరించారు. HIV/AIDS నివారణ, నియంత్రణ చట్టం 2017 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. AIDS ఉన్నవారితో మాట్లాడడం, కలిసి భోజనం చేయడం, కలిసి ఉద్యోగం చేయడం వల్ల మరొకరికి సోకదని, కేవలం అసురక్షితమైన లైంగిక కలయికతో మాత్రమే వస్తుందని తెలిపారు.

Similar News

News October 14, 2025

విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షలు వాయిదా

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, జూనియర్ డిప్లొమా ఇన్ జర్మన్, సీనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, సీనియర్ డిప్లొమా ఇన్ జర్మన్ కోర్సుల పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ వాటిని వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పరీక్షలను తిరిగి వచ్చే నెల 4 నుంచి నిర్వహిస్తామన్నారు.

News October 14, 2025

హైదరాబాద్‌లో భారీగా ఇంజీనీర్లు బదిలీ

image

నీటిపారుదల శాఖలో భారీగా ఇంజినీర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 106 మంది అధికారులను బదిలీ చేస్తూ ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక్క హైదరాబాద్ సర్కిల్‌లో 60 మందికి పైగా బదిలీ అయ్యారు. ఒక్కసారి 106 మంది అధికారులు బదిలీ కావడంతో ఇరిగేషన్ శాఖలో చర్చకు దారి తీసింది. చాలా ఏళ్లుగా అధికారులు ఒకే స్థానంలో ఉండటంతో ప్రభుత్వం ప్రస్తుతం బదిలీ చేసినట్లు సమాచారం.

News October 14, 2025

జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పోటీపై ఒవైసీ కీలక ప్రకటన

image

​జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు MIM అభ్యర్థిపై ఒకటి, రెండురోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. పదేళ్ల BRS పాలనలో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి లేదన్న ఆయన.. BRS నుంచి ఇక్కడ మంత్రి ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారన్నారు. బీజేపీకి పాజిటివ్‌గా ఉండటానికి తాను అభ్యర్థిని నిలబెడతాననే విమర్శలు వస్తాయన్న ఆయన.. కాంగ్రెస్‌కు తాము ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు.