News January 9, 2025
HYD: AIDS వచ్చిన వారిని వెలివేస్తే జైలు శిక్ష..!

HIV/AIDS వచ్చిన వారిపై ఉద్యోగ స్థలంలో వివక్ష చూపి, వెలివేస్తే చట్టపరకారంగా జైలు శిక్ష ఉంటుందని HYD, MDCL TGSACS అధికారులు హెచ్చరించారు. HIV/AIDS నివారణ, నియంత్రణ చట్టం 2017 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. AIDS ఉన్నవారితో మాట్లాడడం, కలిసి భోజనం చేయడం, కలిసి ఉద్యోగం చేయడం వల్ల మరొకరికి సోకదని, కేవలం అసురక్షితమైన లైంగిక కలయికతో మాత్రమే వస్తుందని తెలిపారు.
Similar News
News March 7, 2026
రంగారెడ్డి: బాలికలకు రేపు HPV

బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన HPV టీకా కార్యక్రమ అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం విడుదల చేశారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో ఈ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ అధికారికంగా ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.లలిత దేవి తెలిపారు. అర్హులైన బాలికలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
News March 7, 2026
రేపటి నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ: డీఎంహెచ్‌ఓ

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ లలిత తెలిపారు. శనివారం ఆమె ఆమనగల్లులో మాట్లాడుతూ.. మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు 4 విడతల్లో చేస్తామని వెల్లడించారు. అలాగే, రేపటి నుండి జిల్లావ్యాప్తంగా హెచ్‌పీవీ(HPV) వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
News March 6, 2026
RR: మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆరుగురు స్టూడెంట్స్

ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నిఘా నీడలో ద్వితీయ సంవత్సర పరీక్షలు కొనసాగాయి. 67,578 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 66,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 1,087 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా, ఒకే సెంటర్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు విద్యార్థులు స్క్వాడ్‌కు పట్టుబడ్డారు.


