News January 9, 2025
HYD: AIDS వచ్చిన వారిని వెలివేస్తే జైలు శిక్ష..!
HIV/AIDS వచ్చిన వారిపై ఉద్యోగ స్థలంలో వివక్ష చూపి, వెలివేస్తే చట్టపరకారంగా జైలు శిక్ష ఉంటుందని HYD, MDCL TGSACS అధికారులు హెచ్చరించారు. HIV/AIDS నివారణ, నియంత్రణ చట్టం 2017 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. AIDS ఉన్నవారితో మాట్లాడడం, కలిసి భోజనం చేయడం, కలిసి ఉద్యోగం చేయడం వల్ల మరొకరికి సోకదని, కేవలం అసురక్షితమైన లైంగిక కలయికతో మాత్రమే వస్తుందని తెలిపారు.
Similar News
News January 10, 2025
HYD: సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఇలా తెలుసుకోండి!
HYD నగరం నుంచి MGBS, JBS, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ క్రాస్ రోడ్డు, గచ్చిబౌలి, ఆరాంఘర్, బోయిన్పల్లి తదితర ప్రాంతాల నుంచి సంక్రాంతికి నేటి నుంచి స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. వరంగల్, హనుమకొండ, నల్గొండ, మంచిర్యాల, భూపాలపల్లి లాంటి ప్రాంతాలకు వెళ్లే బస్సుల వివరాలు తెలుసుకునేందుకు 040-69440000, 040-23450033కు కాల్ చేయాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
News January 10, 2025
MBNR కార్పొరేషన్‌లోకి RR గ్రామాలు..!
పరిగి మున్సిపాలిటీలోని ఆరు, నార్సింగిలోని ఒకటి శంషాబాద్‌లో ఒక గ్రామాన్ని మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో చేర్చనున్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ కార్పొరేషన్ విస్తరణలో RR, VKB జిల్లాకు చెందిన ప్రాంతాలు సైతం కలపనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆయా మున్సిపాలిటీల్లో గ్రామల సంఖ్య తగ్గనుంది.
News January 10, 2025
HYD: సంక్రాంతి పండుగ సందర్భంగా రాచకొండ సీపీ సూచనలు
రాచకొండ CP సుధీర్ బాబు సూచనల మేరకు సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజల ఆస్తి రక్షణకు చిట్కాలను విడుదల చేశారు. ప్రజలు తమ విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి. ఇంటిలో CC కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, అలారమ్ వ్యవస్థలు అమర్చుకోవాలి. అల్మారాలు, లాకర్ల తాళాలు కనిపించని ప్రదేశాల్లో దాచాలి. ఇంట్లో కొన్ని లైట్లు ఆన్లో ఉంచడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని CP తెలిపారు.