News November 7, 2024
HYD: AIIMSలో డెంగ్యూ వ్యాక్సిన్‌పై పరిశోధనలు
బ్రెయిన్ ఫీవర్, డెంగ్యూకు త్వరలోనే పరిష్కారం దొరకనుంది. HYD ఘట్కేసర్ శివారులోని బీబీనగర్ AIIMS విశ్వ విద్యాలయంలో వైద్య పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించామని డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా వివరించారు. వైద్యులు బ్రెయిన్ ఫీవర్, డెంగ్యూ వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్నారని పేర్కొన్నారు. పరిశోధనల ద్వారా వైద్య విధానంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందని తెలిపారు.
Similar News
News December 2, 2024
ఓయూలో ఈనెల 11 నుంచి పరీక్షలు
ఓయూ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఓయూ పరిధిలో వివిధ డిగ్రీ కోర్సుల ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతాయన్నారు.
News December 2, 2024
HYD: సికింద్రాబాద్ పేరు ఎలా వచ్చిందో..తెలుసా.?
HYDలోని ప్రస్తుత సికింద్రాబాద్ ప్రాంతాన్ని అప్పట్లో లష్కర్ అని పిలిచేవారు. లష్కర్ అనే పదానికి అర్థం ఆర్మీ క్యాంప్. అప్పట్లో ఈ ప్రాంతంలో బ్రిటిష్ ఆర్మీ ఈ ప్రాంతంలో ఉండేవారు. మూడో నిజాం ‘సికిందర్ జా’ పేరు మీద 1806లో లష్కర్ ప్రాంతాన్ని ‘సికింద్రాబాద్’ ప్రాంతంగా పేరు మార్చారని చరిత్ర చెబుతోందని చరిత్రకారులు మురళి తెలిపారు.
News December 2, 2024
ఉప్పల్ నుంచి తొర్రూర్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్
ఉప్పల్ నుంచి తొర్రూర్ వెళ్లేందుకు రింగ్ రోడ్డు వద్ద ఉదయం 4:19 గంటలకు మొదటి ఆర్టీసీ బస్ అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ బస్సులో మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదే సమయంలో మరో సూపర్ లగ్జరీ బస్సు సైతం అందుబాటులో ఉన్నట్లుగా పేర్కొన్నారు. భువనగిరి, మోత్కూరు, తొర్రూరు వెళ్లే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.