News November 1, 2024
HYD: AIR మార్షల్ అజయ్ కుమార్ ప్రస్థానం ఇదే..!
ఎయిర్ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ మెయింటెనెన్స్ బాధ్యతలను డిల్లీలో ఎయిర్ మార్షల్ అజయ్ కుమార్ అరోరా నేడు చేపట్టారు. బెంగళూరు ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజ్, సికింద్రాబాద్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, IIT ఖరగ్ పూర్‌లో విద్యను అభ్యసించారు. పూణే యూనివర్సిటీలో మేనేజ్మెంట్ అంశంలో డాక్టరేట్ పొందిన అజయ్ కుమార్ 38 సంవత్సరాలుగా సర్వీస్ అందిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.
Similar News
News December 9, 2024
HYD: వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
ఈనెల 20, 21 తేదీల్లో జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆహ్వానించారు. శాసనసభ ఆవరణలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన జానయ్య ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్సవాలకు హాజరు కావడంపై సీఎం సానుకూలంగా స్పందించారు.
News December 9, 2024
RR: టీకా వాహనాలను ప్రారంభించిన కలెక్టర్
సంచార టీకా ద్విచక్ర వాహనాలను సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ వాహనాలు పల్లెలు, పట్టణాలు, జన సంచార ప్రాంతాలలోకి చేరుకొని పిల్లలు, గర్భిణీలకు నూరు శాతం టీకాలు ఇచ్చేందుకు దోహదపడతాయని చెప్పారు. డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, జిల్లా ఇమ్యు నైజేషన్ అధికారి షీభహయత్, డిప్యూటీ డిఎంహెచ్ఓ రాకేశ్, డీపీఓ అక్రమ్ పాల్గొన్నారు.
News December 9, 2024
REWIND: NIMSలో KCR దీక్ష విరమణ
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.