News January 20, 2025

HYD: AIR PORT రన్ వే కింద నుంచి ఎలివేటెడ్ కారిడార్!

image

ఎయిర్‌పోర్ట్ అథారిటీ పరిమితుల కారణంగా HMDA డబుల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయ రన్ వే కింద నుంచి అండర్ గ్రౌండ్‌లో తాడ్ బండ్, బోయిన్‌పల్లి మధ్యలో దాదాపు 600 మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ మెట్రో ఎండీ NVS రెడ్డి తెలియజేశారు. కంటోన్మెంట్ ఏరియాలో విస్తృతంగా పర్యటించి, మార్గాలను పరిశీలించారు.

Similar News

News February 19, 2025

HYD: గుండెపోటుతో మరో లాయర్ మృతి..!

image

HYDలో నేడు మరో లాయర్ గుండెపోటుతో మృతి చెందారు. తార్నాకకు చెందిన లాయర్ వెంకటరమణ మారేడ్‌పల్లిలోని ఇండియన్ బ్యాంక్‌లో చలానా కట్టేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారని స్థానికులు తెలిపారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిన్న హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే లాయర్ వేణుగోపాల్ రావు మరణించిన సంగతి తెలిసిందే. వరుస హార్ట్ఎటాక్‌లు HYDలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

News February 19, 2025

HYDలో వ్యభిచారం.. పోలీసుల ఫోకస్

image

గ్రేటర్‌లో హ్యుమాన్ ట్రాఫికింగ్‌పై సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో వ్యభిచార గృహాలపై మెరుపుదాడులు చేస్తున్నారు. కూకట్‌పల్లిలో వాహనదారులకు సైగలు చేస్తూ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మహిళలను మంగళవారం బైండోవర్ చేశారు. గత కొద్ది రోజులుగా KPHB మెట్రో సమీపంలో‌నూ నిఘా పెట్టారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News February 19, 2025

గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం

image

HYD గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్‌ను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. శంకర్‌పల్లి నుంచి నార్సింగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

error: Content is protected !!