News January 20, 2025

HYD: AIR PORT రన్ వే కింద నుంచి ఎలివేటెడ్ కారిడార్!

image

ఎయిర్‌పోర్ట్ అథారిటీ పరిమితుల కారణంగా HMDA డబుల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయ రన్ వే కింద నుంచి అండర్ గ్రౌండ్‌లో తాడ్ బండ్, బోయిన్‌పల్లి మధ్యలో దాదాపు 600 మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ మెట్రో ఎండీ NVS రెడ్డి తెలియజేశారు. కంటోన్మెంట్ ఏరియాలో విస్తృతంగా పర్యటించి, మార్గాలను పరిశీలించారు.

Similar News

News November 5, 2025

BE READY.. నగరంలో బిగ్గెస్ట్ పెట్ షో

image

ఈనెల 22,23 తేదీల్లో సిటీలో అతి పెద్ద పెట్ షో జరుగనుంది. నార్సింగిలోని ఓమ్ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. దాపు 500 విభిన్న జాతులకు చెందిన కుక్కలు ప్రదర్శనకు రానున్నాయి. అంతేకాక వందకుపైగా పిల్లుల జాతులు, అరుదైన చేపలు అలరించనున్నాయి. ఇంకో విషయమేమంటే.. ఈ ఎగ్జిబిషన్‌లో పెట్స్ యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

News November 5, 2025

HYD: పులులను లెక్కించాలని ఉందా.. మీ కోసమే!

image

దేశంలో పులుల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుందా? అవి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది మీ కోసమే. వచ్చే ఏడాది జనవరిలో(17- 23 వరకు) ప్రభుత్వం పులుల గణన చేపట్టనుంది. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అయితే రోజుకు 10- 15 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అంతేకాక మీ వయసు 18- 60 ఏళ్లలోపు ఉండాలి. ఈ నెల 22లోపు అప్లై చేసుకోవాలి. వివరాలకు 040-23231440 నంబరుకు ఫోన్ చేయండి.

News November 5, 2025

బల్కంపేట ఎల్లమ్మ గుడిలో నేడు దీపోత్సవం

image

కార్తీక పౌర్ణమి వేడుకలు బల్కంపేట ఎల్లమ్మ గుడిలో బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సా.6 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని టెంపుల్ ఈవో శేఖర్ పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించనన్నారు.