News November 5, 2024
HYD: ALERT ట్రాఫిక్ పోలీసులు చూస్తున్నారు

నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. బైక్ నడిపే వారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. దీనికి నేటి నుంచి స్పెషల్‌డ్రైవ్ నిర్వహించనున్నారు. 3 రోజులుగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారని, ఇందుకు హెల్మెట్ లేకపోవడమే కారణమని సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వ ప్రసాద్ తెలిపారు. హెల్మెట్ లేకపోతే రూ.200, రాంగ్ రూట్లో వెళితే రూ.2వేలు చలానా విధిస్తామన్నారు.
Similar News
News February 28, 2026
అవినీతి అనకొండల గుండెల్లో ACB ‘దడ’

సిటీలో లంచగొండి బాబుల ఆటలు ఇక సాగవు. 2025లో తెలంగాణ ACB ఏకంగా 199 కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 29.2% పెరుగుదల. ముఖ్యంగా GHMC పరిధిలో 2025 చివరి మూడు నెలల్లోనే గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 78 కేసులు నమోదయ్యాయి. మొత్తం 273 మందిని అరెస్ట్ చేయగా, అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ₹96.13 కోట్ల అక్రమ సంపాదనను ఏసీబీ బయటపెట్టింది.
News February 28, 2026
తొమ్మిదే నెలల్లో ‘ఫ్యూచర్ సిటీ’ నైటౌట్

హైదరాబాద్ రేంజ్ మారిపోతోంది బాబోయ్! 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’కి సర్కార్ డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. కేవలం 9 నెలల్లోనే పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని టెండర్లో స్పష్టం చేసింది. 56 గ్రామాలను కలుపుతూ గ్లోబల్ కంపెనీలు, యూనివర్సిటీలే లక్ష్యంగా ఈ నగరం నిర్మిస్తున్నారు. కాలుష్యం లేని నెట్-జీరో పద్ధతిలో అద్భుత నగరం మన కళ్లముందే సాక్షాత్కరించబోతోంది.
News February 28, 2026
HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ స్కెచ్

HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ అదిరిపోయే స్కెచ్ వేసింది. నియోపోలిస్ ఎత్తు ప్రాంతాన్ని వాడుకొని పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీళ్లందించేలా పక్కా ప్లాన్ రెడీ చేసింది. కొండపై భారీ రిజర్వాయర్లు కట్టి.. అక్కడి నుంచి మెహదీపట్నం, షేక్‌పేట, బోజగుట్టలకు గోదావరి జలాలను పారించనున్నారు. పంపింగ్ అవసరం లేకపోవడంతో జలమండలికి కోట్లాది రూపాయల కరెంటు బిల్లులు ఆదా కానున్నాయి. నగరవాసుల నీటి కష్టాలు తీరనున్నాయి.


