News June 29, 2024

HYD: ALERT.. పోస్ట్ ఆఫీస్ పేరుతో FAKE మెసేజ్‌లు

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లో ఉంటున్న ప్రజలకు అందులోనూ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఉన్నవారికి పోస్ట్ ఆఫీస్ పేరిట ఫేక్ మెసేజులు, కాల్స్, మెయిల్స్ వస్తున్నట్లుగా HYD తపాలా కార్యాలయ అధికారులు తెలియజేశారు. మీ పార్సల్ వేర్ హౌస్ వద్దకు వచ్చిందని, మీ కరెక్ట్ అడ్రస్ పంపాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో పంపొద్దని సూచించారు. నకిలీ లింకులపై క్లిక్ చేయొద్దని, సమస్యలపై sancharsaathi.gov.in/sfcలో ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News October 21, 2025

HYD: ప్రభుత్వం వద్దకు మెట్రో.. సిబ్బందిలో టెన్షన్..!

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం మెట్రో రైల్ ప్రాజెక్టులో 1,300 మంది రెగ్యులర్ స్టాఫ్, 1,700 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. మెట్రో రైల్ నిర్వహించే ఎల్ అండ్ టీ సంస్థకు ఫ్రాన్స్ సంస్థ కియోలిస్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న స్టాఫ్ తమ పరిస్థితి ఏమిటో అని ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.

News October 21, 2025

BREAKING: HYD: అల్కాపురి టౌన్‌షిప్‌లో యాక్సిడెంట్

image

HYD పుప్పాలగూడ పరిధి అల్కాపురి టౌన్‌షిప్‌లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే నవీన్, తన కుమారుడు కుశల జోయల్‌తో కలిసి వస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

News October 21, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. అసంతృప్తుల నామినేషన్..!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న పలువురు నామినేషన్ వేసి సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఫార్మాసిటీ బాధితులు, RRR బాధితులు, మాల మహానాడు నాయకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు, నిరుద్యోగ యువత ఈరోజు షేక్‌పేట్‌లోని నామినేషన్ సెంటర్‌లో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.