News March 16, 2024
HYD: ముస్లింలపై దాడులు పెరిగి పోతున్నాయి: ఒవైసీ

దేశంలోని ముస్లింలపై దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలు అణచివేతకు గురవుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, HYD ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం సందర్భంగా ఆయన చార్మినార్ మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు, యాముల్ ఖురాన్ పఠనం కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఐఎం చేస్తున్న అభివృద్ధి పనులపై వివరించారు.
Similar News
News March 28, 2026
RR జిల్లాలో HPV వ్యాక్సినేషన్ సెంటర్లు ఇవే..!

రంగారెడ్డి జిల్లా పరిధిలో అనేక చోట్ల HPV వాక్సినేషన్ ప్రారంభించారు. 14 ఏళ్లు నిండి 15 ఏళ్ల లోపు బాలికలకు అందిస్తున్నారు. రాజేంద్రనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కొండాపూర్ జిల్లా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ప్రాంతాల్లో వీటిని అందిస్తున్నారు. తల్లిదండ్రులతో ప్రతి ఒక్కరు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని, పిల్లలకు అందించాలని డాక్టర్లు సూచించారు.
News March 25, 2026
ప్రజాపాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: RR కలెక్టర్

ప్రజాపాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఫైల్స్ క్లియర్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్వో సంగీత, తదితరులు ఉన్నారు.
News March 25, 2026
రంగారెడ్డి జిల్లాలో 13 మంది MLAలు అయ్యే చాన్స్

రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 8 నియోజకవర్గాల సంఖ్య 13కు చేరే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌లో కొత్తగా శంషాబాద్ ఏర్పడనుంది. మహేశ్వరం నుంచి కొత్తగా సరూర్‌నగర్ పేరుతో మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్బీనగర్ నుంచి కొత్తగా హయత్‌నగర్ మరో నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో కొంత భాగాన్ని దీనిలో కలిపే ఛాన్స్ ఉంది. ఈ మేరకు కొత్త నేతలకు అవకాశాలు లభించనున్నాయి.


