News March 16, 2024

HYD: ముస్లింలపై దాడులు పెరిగి పోతున్నాయి: ఒవైసీ

image

దేశంలోని ముస్లింలపై దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలు అణచివేతకు గురవుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, HYD ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం సందర్భంగా ఆయన చార్మినార్ మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు, యాముల్ ఖురాన్ పఠనం కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఐఎం చేస్తున్న అభివృద్ధి పనులపై వివరించారు.

Similar News

News November 22, 2025

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమేనా?

image

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే MLA దానం నాగేందర్ AICC పెద్దలతో సమావేశమయ్యారు. అనర్హత అనివార్యమైతే పదవి వదులుకోవాల్సిందే. రాజీనామా చేస్తే MLA టికెట్ తనకే ఇవ్వాలని ఆయన AICCని కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ టికెట్ కోసం ఆశావహులు ముందుకొస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశానని ఖైరతాబాద్ సీనియర్ లీడర్ రాజు యాదవ్ టికెట్ తనకే ఇవ్వాలని
సెంటర్‌లో బ్యానర్ కూడా పెట్టేశారు.

News November 22, 2025

HYD: నిద్రావస్థలో.. నిఘా నేత్రం!

image

‘మేము సైతం’ నినాదంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల పర్యవేక్షణపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్‌ సీతాఎవెన్యూ కాలనీతోపాటు మీర్‌పేట్ MLR కాలనీలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమైనా వాటి నిర్వహణకు పోలీసులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల వ్యవస్థపై పోలీస్ బాస్‌లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

News November 22, 2025

HYD: ఐబొమ్మ రవి కేసులో సీఐడీ రంగ ప్రవేశం

image

ఐబొమ్మ రవి కేసులో తెలంగాణ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ యాప్‌లను రవి ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడు. నాలుగు బెట్టింగ్ యాప్‌లను రవి ప్రమోషన్ చేశాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర నుంచి సీఐడీ సేకరించింది. రవి ఆర్థిక లావాదేవీలపైనా వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.