News December 8, 2024
HYD: B1, B2 వీసాలకు ఫుల్ డిమాండ్..!
HYD నగరంలో B1,B2 వీసాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని US కాన్సులేట్ జెన్నిఫర్ తెలిపారు. వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూలో భారతదేశ రికార్డును శనివారం నాడు బ్రేక్ చేసినట్లుగా వెల్లడించారు. కొత్త టెక్నాలజీ వినియోగం, పెరిగిన సిబ్బందితో నిరీక్షణ సమయం చాలా వరకు తగ్గిందని, సేవలను అద్భుతంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇందుకు తమకు సంతోషంగా ఉందని తెలిపారు.
Similar News
News January 13, 2025
HYD: నుమాయిష్‌కు ఇప్పటివరకు 2.75 లక్షల మంది
HYDలో జరుగుతున్న 84వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల నుమాయిష్‌కు ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. దాదాపు 75 వేల మంది సందర్శించారని పేర్కొన్నారు. 80 సీసీ కెమెరాలతో ఎగ్జిబిషన్‌లో నిఘాను ముమ్మరం చేసినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 2.75 లక్షల మంది ఎగ్జిబిషన్‌కు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
News January 13, 2025
HYDలో 15డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. వెస్ట్ మారేడ్‌పల్లి, సులేమాన్ నగర్‌లో 17.1℃, మోండామార్కెట్ 17.2, షేక్‌పేట 17.3, రియాసత్‌నగర్ 17.4, గోల్కొండ 17.6, ఓయూ, చాంద్రయాణగుట్ట 17.7, కంచన్‌బాగ్, మెట్టుగూడ, బౌద్ధనగర్, తిరుమలగిరి 18, అడిక్‌మెట్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట్ 18.1, బంజారాహిల్స్ 18.2, విజయనగర్ కాలనీ, కందికల్ గేట్, భోలక్‌పూర్, ముషీరాబాద్ 18.4, లంగర్‌హౌస్‌లో 18.5℃గా నమోదైంది.
News January 13, 2025
పరేడ్ గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్ ప్రారంభించనున్న సీఎం
సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది. ఈ ఫెస్టివల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. మొత్తం 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ ఫెస్టివల్‌లో పాల్గొనబోతున్నారు.