News November 4, 2025

HYD: BANKలో JOBS.. రెండ్రోజులే ఛాన్స్

image

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు ఎల్లుండితో ముగుస్తుంది. HYDలో 32 స్టాఫ్ అసిస్టెంట్‌‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి.
SHARE IT

Similar News

News November 4, 2025

క్లాసెన్‌ను రిలీజ్ చేయనున్న SRH?

image

IPL: వచ్చే నెలలో జరిగే మినీ ఆక్షన్‌కు ముందు స్టార్ బ్యాటర్ క్లాసెన్‌ను SRH రిలీజ్ చేసే అవకాశం ఉందని ToI పేర్కొంది. ఇతడి కోసం పలు ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని తెలిపింది. గత మెగా వేలానికి ముందు రూ.23 కోట్లతో క్లాసెన్‌ను ఆరెంజ్ ఆర్మీ రిటైన్ చేసుకుంది. అతడిని రిలీజ్ చేస్తే వచ్చే డబ్బుతో మంచి బౌలింగ్ అటాక్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో జట్టును బ్యాలెన్స్ చేసుకోవచ్చని SRH భావిస్తున్నట్లు సమాచారం.

News November 4, 2025

వట్లూరు వద్ద రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

image

బెంగళూరుకు చెందిన ఉమాశంకర్ (72) యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బెంగళూరు నుంచి భువనేశ్వర్‌కు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించారు. మంగళవారం ఉదయం ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని వట్లూరు సమీపంలో రైలు నుంచి జారిపడి ఆయన మృతి చెందారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 4, 2025

ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

image

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. <<-se>>#haircare<<>>