News August 5, 2025

HYD: BC రిజర్వేషన్లకు దీక్ష చేయాలి: తీన్మార్ మల్లన్న

image

సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావులకు చిత్తశుద్ధి ఉంటే 42% బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న డిమాండ్‌ చేశారు. ఈ విషయమై అన్ని పార్టీలు బీసీల నినాదాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లకు అడ్డు ఎవరూ లేరని, కానీ ఈ 3 పార్టీలు నయానాటకానికి తెరతీస్తున్నాయన్నారు.

Similar News

News August 6, 2025

ఓయూ: బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల పరీక్షల తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను ఈనెల 12వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News August 6, 2025

ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి: హైదరాబాద్ కలెక్టర్

image

హైదరాబాద్ జిల్లాలో అనుమతి లేని ఆసుపత్రులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన వైద్యాధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రిజిస్టరింగ్ అథారిటీ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ కదిరవన్ పళని, DCP డా.లావణ్యతో కలిసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

News August 6, 2025

చింతల్‌బస్తీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కలెక్టర్ తనిఖీ

image

హైదరాబాద్‌లో వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన వైద్యాధికారులను ఆదేశించారు. చింతల్‌బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు తనిఖీ చేసి మాట్లాడారు. రోగులకు టెస్ట్‌లు చేసి, వైద్య చికిత్సలు అందించాలని ఆమె సూచించారు.