News July 21, 2024
HYD: BCG టీకా అందించేది వీరికే..!

HYD, RR, MDCL,VKB జిల్లాల్లో BCG టీకాను కింది పేర్కొన్న వారికి అందిస్తారు.
✓ప్రస్తుతం 60 సంవత్సరాలు పైబడిన వారికి
✓BMI శరీర ద్రవ్యరాశి సూచిక 18 కన్నా తక్కువ ఉన్నవారికి
✓ మద్యపానం తాగేవారికి
✓కొన్ని ఏళ్లుగా ధూమపానం తాగే వారికి
✓క్షయవ్యాధి ఉన్నవారి కుటుంబసభ్యులకు ✓ 5 ఏళ్లుగా క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి అందించనున్నారు.
Similar News
News November 26, 2025
లైన్క్లియర్: HYDలో అండర్ గ్రౌండ్ నుంచి కేబుల్స్!

విద్యుత్ సరఫరా సమస్యలు పరిష్కరించేందుకు TGSPDCL చర్యలకు ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అండర్ గ్రౌండ్ కేబుల్స్ తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు పంపగా తాజాగా మంత్రివర్గం ఇందుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రూ.14,725 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇది సక్సెస్ అయితే సిటీలో కరెంట్ పోల్స్, వేలాడుతోన్న వైర్ల సమస్యకు తెర పడనుంది.
News November 26, 2025
HYD చుట్టూ 4వ సింహం.. మీ కామెంట్?

GHMC విస్తరణతో ఇండియాలోనే అత్యధిక జనాభా కలిగిన నగరం మనదే అవుతుంది. దీంతో ఇప్పుడు ఉన్న వ్యవస్థ, అధికారులకు అడ్మినిస్ట్రేషన్ హ్యాండిలింగ్ సవాల్గా మారనుంది. పరిపాలన సౌలభ్యం కొరకు వ్యవస్థను కూడా పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 3 కమిషనరెట్లు ఉంటే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, గ్రేటర్ చుట్టూ 4 కమిషనరేట్లు పెడితే ఎలా ఉంటుంది?.. దీనిపై హైదరాబాదీ కామెంట్?
News November 26, 2025
విలీనం ఎఫెక్ట్.. GHMC ఎన్నికలు ఆలస్యం?

GHMC ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న కార్పొరేటర్లు మరికొంత కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014-16 మధ్య రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారులతో గ్రేటర్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగింది. ప్రస్తుతం 27 ULBలను విలీనానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో అన్నీ సర్దుబాటు అయ్యేవరకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టేలా ఉంది. ఫిబ్రవరి 10తో పాలకవర్గం ముసిగినా.. ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.


