News June 6, 2024
HYD: BJPకి ఓట్లు వేయించిన BRS MLAలు?

గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో BRSకు పోలైన ఓట్లు ఈ సారి BJP వైపు మొగ్గుచూపడంతో చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో ఓటమి పాలైనట్లు INC శ్రేణులు పేర్కొంటున్నాయి. సికింద్రాబాద్‌లో పద్మారావుకు ఓట్లు తగ్గడంతోనే BJP గట్టెక్కిందంటున్నారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ముగ్గురు BRS MLAలు కొండాకి ఓట్లు వేయిస్తే, మల్కాజిగిరిలోనూ నలుగురు MLAలు ఇదే పని చేశారని INC నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 29, 2025
శాతవాహన ఎక్స్‌ప్రెస్.. జనగాంలో అదనపు స్టాప్

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు జనగాం స్టేషన్‌లో అదనపు స్టాప్ ప్రకటించింది. ప్రయోగాత్మకంగా అక్టోబర్ 30, 2025 నుంచి అమల్లోకి రానుంది. విజయవాడ- సికింద్రాబాద్ ఉ.10:14, సికింద్రాబాద్- విజయవాడ సా.17:19కి జనగాం చేరుకొని, నిమిషం పాటు వెయిట్ చేస్తుందని పేర్కొంది.
News October 29, 2025
శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మొబైల్స్, ఈ-సిగరేట్స్ సీజ్

శంషాబాద్ విమానాశ్రయంలో అరైవల్ ర్యాంప్ వద్ద గుర్తుతెలియని యాష్ కలర్ హ్యాండ్‌బ్యాగ్ వదిలి వెళ్లారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ వెంటనే SOCCకి సమాచారం అందించింది. తక్షణమే BDDS బృందం ఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు నిర్వహించి బ్యాగ్ సురక్షితమని ప్రకటించింది. బ్యాగ్‌లో మొబైల్ ఫోన్లు,ఈ- సిగరెట్లు లభించాయి. మొత్తం విలువ సుమారు ₹12.72 లక్షలని తెలిపారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News October 29, 2025
HYD: వేగంగా డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్ పనులు

సికింద్రాబాద్‌లో డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మట్టి పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. బేగంపేట విమానాశ్రయం సమీపంలో 600 మీటర్ల సొరంగం నిర్మాణం ప్రణాళికలో ఉంది. రూ.1,550 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే NH-44 రహదారి ట్రాఫిక్ సమస్యలు తగ్గి ఉత్తర తెలంగాణతో రవాణా మరింత సులభం కానుందని అధికారులన్నారు.


