News April 19, 2024
HYD: BJPకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ

బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ రవీందర్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. నాటి ప్రధాని ఇందిరమ్మ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో రవీందర్ నాయక్ ఒకరు. రాష్ట్రంలో గిరిజనులను ప్రభావితం చేసే నాయకుడు కావడంతో పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం కాంగ్రేస్‌కు మరింతగా కలిసి రానుంది.
Similar News
News November 15, 2025
రంగారెడ్డి: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జీ.ఆశన్న సూచించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు 2025-26 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలనన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు.
News November 12, 2025
FLASH: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.
News November 11, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: MLAలు, మాజీ MLAలపై కేసు నమోదు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ PSలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌పై రెండు కేసులు ఫైల్ అయ్యాయి. బోరబండ PSలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై ఓ కేసు నమోదైంది. కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు సాగాలంటే ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవించాలని సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.


