News June 9, 2024
HYD: BJP సీనియర్ నాయకుడి మృతి
BJP రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ ఫిలిం బోర్డ్ మెంబర్ బి.జంగారెడ్డి ఈరోజు మృతిచెందారని ఆ పార్టీ నేతలు తెలిపారు. HYD శివారు మొయినాబాద్ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన జంగారెడ్డి అనారోగ్యంతో మరణించారని చెప్పారు. ఆయన మృతి BJPకి తీరని లోటని చెబుతూ సంతాపం వ్యక్తం చేశారు. ఏళ్లుగా పార్టీలోనే ఉన్న వ్యక్తి అని, ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని కొనియాడారు.
Similar News
News November 14, 2024
HYDలో కిలో చికెన్ రూ.162
HYDలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత నెల రోజులుగా మాంసం KG రూ. 200కు పైగానే పలికింది. కార్తీక మాసం 2వ వారంలో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. గతవారం స్కిన్‌లెస్ రూ. 234 నుంచి రూ. 245, విత్ స్కిన్ రూ. 200 నుంచి రూ. 215 మధ్య విక్రయించారు. గురువారం స్కిన్ లెస్ KG రూ. 185, విత్ స్కిన్ రూ. 162కి పడిపోయింది. కార్తీక మాసంలో మాంసానికి దూరంగా ఉండడంతో గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
SHARE IT
News November 14, 2024
మాజీ ఉపరాష్ట్రపతి నివాసంలో కులగణన సర్వే
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహించారు. సర్వేను ఎన్యుమరేటర్ ఉమాదేవి, శివ కుమార్ పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణలో సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్ కలిసి పర్యవేక్షించారు. సర్వేలో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించినందుకు వెంకయ్య నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు.
News November 14, 2024
HYD: అక్కడేమో పూజలు.. ఇక్కడేమో ఇలా..!
VKB అనంతగిరి కొండల్లో పుట్టిన మూసికి అక్కడికి వెళ్లిన పర్యటకులు పూలు చల్లి పూజలు చేసి, స్వచ్ఛమైన నీటితో దైవాభిషేకం చేస్తున్నారు. మరి అదే మూసీ.. VKB ప్రాంతంలో పూజలు చేసిన వారే.. HYDలో మూసీని చూడగానే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. PCB ప్రమాణాలకు మించి మూసీ కలుషితమైంది. దీంతో HYDలో 55KM మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని ప్రభుత్వం అంటుంది.