News October 30, 2025
HYD: BJP చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందే: మహేశ్

బీజేపీ చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని కలలు కన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరించే పార్టీ.. మైనార్టీకి మంత్రి పదవి ఇస్తే తప్పేంటి? అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీజేపీకి ఫ్యూచర్లో ఏ పనిలేక చివరికి చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని ఘాటుగా విమర్శించారు.
Similar News
News October 30, 2025
మేడిపల్లిలో ACBకి చిక్కిన విద్యుత్ అధికారి

యాదరిగిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విద్యుత్ శాఖ SE వెంకటరామారావు HYD శివారు మేడిపల్లిలో లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డాడు. మేడిపల్లికి చెందిన ఓ వ్యక్తికి యాదాద్రి ఆలయ పులిహోర యంత్రాల నిర్వహణ కాంట్రాక్టు దక్కింది. రూ.10 లక్షల బిల్లుల మంజూరుకు వెంకటరామారావు 20% లంచం డిమాండ్ చేశాడు. మేడిపల్లి మారుతీనగర్‌లో రూ.1.90 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు.
News October 30, 2025
సికింద్రాబాద్.. మరిన్ని రైళ్లు CANCEL

మొంథా తుఫాన్ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లను పార్షికంగా రద్దు చేస్తున్నట్లు SCR ప్రకటించింది. గుంటూరు సికింద్రాబాద్ 12705 పూర్తిగా క్యాన్సిల్ చేశారు. సికింద్రాబాద్- గుంటూరు రైలును 12706 వరంగల్ నుంచి గుంటూరు మధ్యలో క్యాన్సిల్ చేశారు.12701 గుంటూరు- సికింద్రాబాద్ రైలు డోర్నకల్ సికింద్రాబాద్ మధ్యలో క్యాన్సిల్ చేశారు.
News October 30, 2025
HYD: 2 రోజుల వ్యవధిలో ప్రేమ జంట SUICIDE

2 రోజుల వ్యవధిలో ప్రేమజంట ప్రాణాలు తీసుకున్న హృదయ విదారక ఘటన ఆరుట్లలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. సోమవారం <<18124971>>నందిని<<>>(18) ఆత్మహత్య చేసుకోగా.. తట్టుకోలేని <<18139351>>నాగరాజు<<>> (23) నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. వీరు 2ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిమధ్య మనస్పర్థలతో ఆమె క్షణికావేశంలో ఉరేసుకుంది. తట్టుకోలేక బుధవారం నాగరాజు ప్రాణాలు తీసుకున్నాడు. ఇరుకుటుంబాలు కేసు ఫైల్ చేశాయి.


