News March 18, 2024
HYD: మతం పేరిట ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న BJP: కూనంనేని

పార్లమెంట్ ఎన్నికల్లో BJP మతం, దేవుడి పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. HYD శంషాబాద్ పట్టణంలో సీపీఐ రంగారెడ్డి జిల్లా నాయకులకు, కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆదివారం శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు మాట్లాడారు. BJPపై ఫైర్ అయ్యారు.
Similar News
News October 25, 2025
HYD: డీఐ ఛేజింగ్.. ఎట్టకేలకు అతడు చిక్కాడు..!

HYD దుండిగల్ PS పరిధిలో ఖయ్యూం అనే వ్యక్తి ఒకరిని మోసం చేసి రూ.25 లక్షలను కాజేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం రాత్రి మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఖయ్యూం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో డీఐ కిరణ్ సిబ్బందితో కలిసి వెళ్లాడు. పోలీసులను చూడగానే ఖయ్యూం రైలు పట్టాల మీదుగా పరిగెత్త సాగాడు. డీఐ కిరణ్, సిబ్బంది కలిసి అతడి వెంట పరిగెత్తి సినిమా స్టైల్లో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.
News October 25, 2025
ఓయూ: ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలు ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను నవంబర్ 6 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని ఆయన కోరారు.
News October 25, 2025
HYD: వస్త్రాల వ్యర్థాల రీసైక్లింగ్ అంతంతే..!

గ్రేటర్ HYDలో ఏటా సుమారుగా 15 టన్నులకు పైగా వస్త్రాలకు సంబంధించిన వ్యర్థాలు విడుదలవుతున్నాయి. కానీ.. వీటిని రీసైక్లింగ్, పునర్వినియోగం చేయడంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. కేవలం 14 శాతం మాత్రమే రీసైక్లింగ్ జరుగుతున్నట్లుగా TGTRS తెలియజేసింది. రాబోయే రోజుల్లో ఈ శాతాన్ని మరింత పెంచడం కోసం కృషి చేస్తామని పేర్కొంది.


