News January 18, 2025

HYD: BRAOUలో ట్యూషన్ ఫీజుకు చివరితేదీ ఈ నెలే.!

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సార్వతిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, 2nd, 3rd ఇయర్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరితేదీ జనవరి 25 అని విద్యార్థి సేవల విభాగాల అధిపతి డా. వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్ పొంది సకాలంలో ఫీజు చెల్లించలేకపోయినవారు ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరారు. సందేహాలుంటే 040-236080222 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. 

Similar News

News February 19, 2025

శివాజీ జయంతి: హోరెత్తనున్న హైదరాబాద్

image

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉత్సవాలకు హైదరాబాద్‌ ముస్తాబైంది. హిమాయత్‌నగర్, గోషామహల్, రాంనగర్, అంబర్‌పేట, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నంలో హిందూ ఏక్తా ర్యాలీలు నిర్వహించనున్నారు. శివాజీ మహారాజ్ భారీ విగ్రహాలను సిటీలో ఊరేగిస్తారు. జై భవాని.. జై శివాజీ నినాదాలతో నేడు భాగ్యనగరం హోరెత్తనుంది.

News February 19, 2025

HYD: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్, రక్సౌల్‌కు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లు ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు అందుబాటులో ఉంటాయి. రైళ్ల రాకపోకల వివరాలు.. తేదీల కోసం పైన పేర్కొన్న పట్టికను చూడండి. ఈ రైళ్ల రాకపోకల సమాచారం కోసం SCR వెబ్‌సైట్ చూడొచ్చు.

News February 19, 2025

HYD:”17 మంది నిందితులకు జీవితఖైదు”

image

నల్గొండ జిల్లా SC, ST స్పెషల్ సెషన్స్ కోర్టు అడ్డగూడూర్ పరిధిలో 2017లో జరిగిన హత్య కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది. పాత కక్షల కారణంగా అజీంపేట(V)కి చెందిన బట్ట లింగయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. రాచకొండ పోలీసులు వేగంగా విచారణ జరిపి, పక్కా సాక్ష్యాలను సమర్పించడంతో నిందితులకు కఠిన శిక్ష పడింది.

error: Content is protected !!