News September 9, 2024
HYD: BRSకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ రాజీనామా
BRS హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, నగర ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం కేసీఆర్, కేటీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. అయితే తర్వాత ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని వెల్లడించలేదు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ ఓడిపోయారు.
Similar News
News October 4, 2024
నాంపల్లి: ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్
ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు విజయలక్ష్మి చెప్పారు.
News October 4, 2024
HYD: KTR.. SORRY చెప్పాలి: శ్రీనివాస్
మాజీ మంత్రి KTR వెంటనే మంత్రి కొండా సురేఖకు సారీ చెప్పాలని TPCC ప్రధాన కార్యదర్శి చెకోలేకర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. KTR తరచూ మహిళా ప్రజాప్రతినిధులను కించ పరుస్తున్నాడని మండిపడ్డారు. ఆయన తన BRS పార్టీ సోషల్ మీడియా ద్వారా కొండా సురేఖను ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ మంత్రి సీతక్కపై నోరు పారేసుకున్నారని ఫైర్ అయ్యారు.
News October 4, 2024
HYD: ఈ నెల 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్