News May 11, 2024
HYD: BRSను లేకుండా చేయాలని కాంగ్రెస్, BJP ప్లాన్: KTR

తెలంగాణ గొంతుకైనా BRSను లేకుండా చేయాలని కాంగ్రెస్, BJP కలిసి ప్లాన్ వేశాయని మాజీ మంత్రి KTR ఆరోపించారు. HYD యూసుఫ్‌గూడలో ఈరోజు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, BJP కలిసి ముందు BRSను లేకుండా చేయాలని, ఆ తర్వాత మనం గొడవపడదామని బండి సంజయ్ అన్న ఓ వీడియోను ఆయన సభలో చూపించారు. ఆ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, కానీ ఎన్నికలు రాగానే ఢిల్లీ, గుజరాత్ నుంచి నేతలు వస్తున్నారన్నారు.
Similar News
News November 21, 2025
HYD: చేవెళ్ల హైవేపై మరో ఘోర ప్రమాదం

చేవెళ్ల ట్రాఫిక్ PS పరిధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. మొయినాబాద్‌లోని తాజ్ సర్కిల్ సమీపంలో కనకమామిడి వెళ్లే రూట్లో 2 కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 21, 2025
రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్‌కు నోటీసులు

GHMC ఖజానాకు గండికొడుతున్న సినిమా స్టూడియోలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో విస్తీర్ణానికి ₹11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా యాజమాన్యం ₹49 వేలు చెల్లింస్తోందని గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని రామనాయుడు స్టూడియో విస్తీర్ణం తక్కువ చూపుతూ ₹1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా ₹1,900 చెల్లిస్తుండడంతో GHMC సర్కిల్ 18 అధికారులు నోటీసులు జారీ చేశారు.
News November 21, 2025
హైదరాబాద్‌లో గజ.. గజ.. గజ..

HYDలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. 10ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా చలి రికార్డు సృష్టిస్తోంది. నిన్న పటాన్‌చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6.4 తక్కువగా నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌లో 11.5, హయత్‌నగర్‌లో 12.6, అటు కూకట్‌పల్లి, ఇటు పాతబస్తీ పరిసరాల్లో 13°Cకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4, కనిష్ఠ ఉష్ణోగ్రత 13.1 డిగ్రీలుగా నమోదైంది. పలుచోట్ల ఉ.8వరకు మంచు కురుస్తోంది.


