News July 30, 2024

HYD: BRSలోకి‌ కాంగ్రెస్ MLA.. క్లారిటీ

image

సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అటువంటి వార్తలను నమ్మొద్దని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు బీ‌ఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ ఈ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుతున్నారని‌ వార్తలు వస్తున్నట్లు గుర్తు చేశారు. కానీ, ఆ జాబితాలో తాను లేనన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని కాలే యాదయ్య స్పష్టం చేశారు.

Similar News

News December 16, 2025

నెహ్రూ జూ పార్క్‌లో AI కమాండ్ కంట్రోల్ సెంటర్‌

image

నెహ్రూ జూ పార్క్ చరిత్రలో ఒక అద్భుతం జరగబోతోంది. త్వరలో AI కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అడవి బిడ్డల రక్షణలో ఇది సరికొత్త రికార్డు సృష్టించనుంది. AI సాయంతో జంతువుల ప్రతి కదలికను, వాటి ఆరోగ్యాన్ని 24/7 పర్యవేక్షించవచ్చు. ఏదైనా చిన్న మార్పు వచ్చినా ఈ స్మార్ట్ సెంటర్ వెంటనే హెచ్చరిస్తుంది. ప్రైవేట్ సౌండ్-ప్రూఫ్ టెక్నాలజీతో ఈ కేంద్రాన్ని నిర్మించడం విశేషం.

News December 16, 2025

10 నిమిషాల వీడియో కావాలా? HYDలో కొత్త దందా!

image

‘మీకు 10 నిమిషాల ఆ వీడియో కావాలా? జస్ట్ రూ.200. 30 నిమిషాల లైవ్ చాట్ రూ.300. 2 గంటల లైవ్ అశ్లీల వీడియో చాట్ రూ.500. కింద కనిపిస్తున్న అమ్మాయిల నంబర్లకు కాల్ చేయండి.’ అంటూ SMలో కొత్త దందా మొదలైంది. ముందుగా డబ్బులు పంపి, ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేయాలని కండీషన్ పెడుతారు. టెంప్ట్ అయ్యి ఆ పని చేయకండి. ఆ తరువాత వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని HYD పోలీసులు సూచించారు.

News December 16, 2025

HYDలో KCR మీటింగ్ వాయిదా

image

ఈ నెల 19న జరగాల్సిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాన్ని 21వ తేదీకి వాయిదా వేశారు. 19న పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు సమావేశంలో పాల్గొనేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ స్పష్టంచేశారు.