News October 21, 2025
HYD: BRSలో చేరిన BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్

BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ ఈరోజు BRSలో చేరారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి HYDలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహ్మద్ బిన్ అలీ అల్ గుత్మి కూడా ఆమెతోపాటు BRSలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు నిజమైన అభివృద్ధి జరుగుతుందని, అందుకే BRSలో చేరుతున్నట్లు వారు చెప్పారు.
Similar News
News October 22, 2025
HYD: పెద్ద సదర్ ఉత్సవం.. నారాయణగూడలో ట్రాఫిక్ ఆంక్షలు

HYD నారాయణగూడలో అక్టోబర్ 22 రాత్రి నుంచి 23 ఉదయం వరకు పెద్ద సదర్ ఉత్సవ మేళా జరగనుంది. ఈ మేరకు రామ్‌కోటి, లింగంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా అధికారులు మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.
News October 22, 2025
HYD: రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం: పొంగులేటి

రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక వర్షాలకు పత్తి దిగుబడి తగ్గిందని, పత్తి రైతులను ఆదుకుంటామని తెలిపారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే అధికారులను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.
News October 22, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని మహేశ్ కుమార్ లేఖ

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌కి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు లేఖ రాశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునకు సహకరించాలన్నారు. ఇప్పటికే ఎంఐఎం, సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.