News October 29, 2024

HYD: BRS కార్యకర్తలకు KTR కీలక సూచనలు

image

BRS కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఈరోజు HYDలో కీలక సూచనలు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్, BJP, TDP వారి పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ BRSను టార్గెట్ చేస్తాయని వెల్లడించారు. తప్పుడు కేసులు, డీప్ ఫేక్ టెక్నాలజీతో అసత్య ప్రచారం చేస్తారని, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 6 గ్యారంటీల అమలులో ఫెయిల్ అయినందుకు కాంగ్రెస్‌ను ప్రశ్నించాలన్నారు.

Similar News

News October 30, 2024

వారిని కట్టడి చేద్దాం: HYD సీపీ సీవీ ఆనంద్

image

హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని HYD సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం బంజరాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నగర పరిధిలో ఆశ్రయం లేని వ్యక్తుల్లో కొందరికి మానసిక స్థితి సరిగా లేదని, వారు మతపరమైన ప్రదేశాల వద్దకు వెళ్లి దాడులు చేస్తున్నారని, వారిని కట్టడి చేయాలన్నారు.

News October 29, 2024

HYD: ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కీలక వ్యాఖ్యలు

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నేడు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో పలు పబ్బులపై తాము నిఘా ఉంచినట్లు తెలిపారు. మైనర్లను పబ్బులోకి అనుమతించొద్దని ఆదేశించారు. పబ్బుల దగ్గర 40 శాతం స్థలం ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇకపై నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని, పట్టుబడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 29, 2024

HYD: ప్రాణాలు పోతున్నాయ్.. జాగ్రత్త!

image

దీపావళి ముంగిట HYDలో అగ్ని ప్రమాదాలు‌ భయపెడుతున్నాయి. బొగ్గులకుంట ఘటన మరవక ముందే యాకుత్‌పురాలో ఘోరం జరిగింది. బాణసంచా నిల్వ ఉంచిన ఇంట్లో సిలిండర్ పేలి ఇద్దరు చనిపోయారు. అనుమతి లేకుండా టపాసులు నిల్వ చేయడం, నిబంధనలు పాటించకపోవడం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఫైర్ సేఫ్టీ పాటించాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలిచ్చారు. నిబంధనలు పాటిస్తూ విక్రయాలు చేయడం సురక్షితమని అధికారులు సూచిస్తున్నారు.

SHARE IT