News October 29, 2024

HYD: BRS కార్యకర్తలకు KTR కీలక సూచనలు

image

BRS కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఈరోజు HYDలో కీలక సూచనలు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్, BJP, TDP వారి పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ BRSను టార్గెట్ చేస్తాయని వెల్లడించారు. తప్పుడు కేసులు, డీప్ ఫేక్ టెక్నాలజీతో అసత్య ప్రచారం చేస్తారని, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 6 గ్యారంటీల అమలులో ఫెయిల్ అయినందుకు కాంగ్రెస్‌ను ప్రశ్నించాలన్నారు.

Similar News

News January 6, 2026

FLASH: హైదరాబాద్ ఘన విజయం

image

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బరిలోకి దిగిన HYD జట్టులో ఓపెనర్ అమన్ రావు 200* చెలరేగాడు. రాహుల్ సింగ్ (64), తిలక్ వర్మ (34) రాణించారు. 352 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగాల్ 245 పరుగులకే కుప్పకూలింది. కాగా, తిలక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత HYD వరుసగా 2వ విజయం నమోదు చేయడం విశేషం.

News January 6, 2026

HYD: కవిత కాంగ్రెస్‌లో చేరొచ్చు: కాంగ్రెస్‌ MLA

image

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ MLA మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. KCR కూతురు, MLC కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన హింట్ ఇచ్చారు. కాగా, గతంలో ఆయన చెప్పినట్లే దానం నాగేందర్ లాంటి వాళ్లు కాంగ్రెస్‌లో చేరారని గుర్తుచేశారు. దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ రావాల్సి ఉంది.

News January 6, 2026

వారేవా.. HCUకు అంతర్జాతీయ గుర్తింపు

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వర్సిటీకి చెందిన సీనియర్ ప్రొ.అనిల్ కుమార్ చౌదరి, స్కాలర్ చందన్ ఘోరుయీ పేలుడు పదార్థాలను గుర్తించి ప్రమాదాల నివారించే పరికరాన్ని రూపొందించారు. 0.3 టెరాహెట్జ్ రాడార్ వ్యవస్థను తయారుచేశారు. ఇది పేలుడు పదార్థాలను, లోహాలను గుర్తించి ప్రమాదాలను నివారిస్తుంది. వీరి పరిశోధన వివరాలు అంతర్జాతీయ IEEE సెన్సార్ జర్నల్‌లో ప్రచురించారు.