News March 25, 2024
HYD: BRS చతికిల పడింది: ఎంపీ

అభివృద్ధికి పాటుపడతానని కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. HYD శేరిలింగంపల్లిలో ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. BRS పార్టీ చతికిల పడిందని అన్నారు. BJPని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
సికింద్రాబాద్: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా

సికింద్రాబాద్లో ‘పుష్ప’ సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్నారు. దీంతో 15 కిలోమీటర్లు బోయిన్పల్లి పోలీసులు సాహసోపేతంగా ఛేజ్ చేసి ముఠాను అడ్డగించారు. కార్ డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఛేజ్ చేసి పట్టుకున్న ఈ హవాలా గ్యాంగ్ రూ.కోట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 5, 2025
HYD: ఇదేం పునర్విభజన.. మేం ఉండలేం బాబోయ్!

మా ప్రాంతాలను గ్రేటర్లో కలిపితే మాకు అనుకూలంగా ఉండాలి కాని.. ఎక్కడో దూరంగా ఉన్న సర్కిళ్లలో కలిపితే ఎలా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనంలో భాగంగా బడంగ్పేట, తుర్కయాంజల్, ఆదిభట్ల ప్రాంతాలు చార్మినార్ జోన్ కలిశాయి. అయితే ఆయా ప్రాంతాల వారు మాత్రం.. మేము ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉంటామని చెబుతున్నారు. అలాగే పోచారం, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంత వాసులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
News December 5, 2025
HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

గ్రేటర్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.


