News October 22, 2024
HYD: BRS చేసిన అప్పులకు వడ్డీలతో సరిపోతుంది: TPCC చీఫ్

‘పంటల కొనుగోలు ఇంకా స్టార్ట్ కాలేదు.. ఇప్పుడే బోనస్ ప్రస్తావన ఎందుకు హరీశ్రావు గారూ.. మా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తుంది. మీరు చేసిన అప్పులకు మిత్తిలు, కట్టుకుంటూ రైతులకు ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తున్నాం’ అని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ వివరణ ఇచ్చారు. అందులో భాగంగానే రైతుబంధు, రుణమాఫీ, రైతు భరోసా ఇస్తున్నామన్నారు.
Similar News
News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
News November 19, 2025
సా.4 గంటల వరకు సచివాలయ ఉద్యోగులకు వైద్యశిబిరం

రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఉద్యోగులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఉ.11 గంటలకు ప్రారంభమయ్యే శిబిరం సా.4 గంటల వరకు ఉంటుందన్నారు. నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలందిస్తారని.. సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.


