News April 11, 2025
HYD: BRS రజతోత్సవ సభకు రూ.25 లక్షల విరాళం

ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే BRS రజతోత్సవ సభకు పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాశ్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందించారు. ఏర్పాట్లకు రూ.25 లక్షల చెక్కును ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ అవినాశ్ రెడ్డిని అభినందించారు.
Similar News
News November 28, 2025
పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

AP: YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. సరెండర్ కావడానికి 2 వారాల గడువు ఇచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం వారు గతంలో హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో SCని ఆశ్రయించారు.
News November 28, 2025
ఏకగ్రీవాలకు వేలంపాటలు.. SEC వార్నింగ్

TG: సర్పంచ్ ఎన్నికల వేళ ఏకగ్రీవాలకు జోరుగా వేలంపాటలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ పదవిని అంగట్లో సరుకులా డబ్బులు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించేశారు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సిన పదవిని వేలంపాటలో కొనుగోలు చేయడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News November 28, 2025
IPLలో వైభవ్.. WPLలో దీయా

WPL వేలంలో హరియాణాకు చెందిన 16 ఏళ్ల దీయా యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించారు. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ అయిన ఆమెను రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. దీంతో WPLలో అడుగుపెట్టిన పిన్న వయస్కురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. 2023 U-15 ఉమెన్స్ ట్రోఫీలో 578 రన్స్ బాదడంతో దీయా పేరు తెరపైకి వచ్చింది. వైభవ్ సూర్యవంశీ 13ఏళ్లకే IPLలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.


