News April 11, 2025

HYD: BRS రజతోత్సవ సభకు రూ.25 లక్షల విరాళం

image

ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే BRS రజతోత్సవ సభకు పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాశ్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందించారు. ఏర్పాట్లకు రూ.25 లక్షల చెక్కును ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ అవినాశ్ రెడ్డిని అభినందించారు.

Similar News

News July 9, 2025

నెల్లూరు రొట్టెల పండగకు 10 లక్షల మంది భక్తులు హాజరు

image

నెల్లూరు రొట్టెల పండుగకు ఇప్పటివరకు 10 లక్షల మంది భక్తులు హాజరైనట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు. మంగళవారం ఒక రోజే 4 లక్షల మందికి పైగా దర్గాను దర్శించుకున్నట్లు తెలిపారు. ఎండ బాగా ఉన్నప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

News July 9, 2025

YCP నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు

image

AP: TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు మహిళల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కోవూరు పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. త్వరలో ఆయనను పోలీసులు విచారించే అవకాశం ఉంది. కాగా ఈ విషయంపై పలు మహిళా సంఘాలు రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశాయి.

News July 9, 2025

శ్రీకాకుళం: 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం

image

శ్రీకాకుళం జిల్లాలో 22 పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు)కు ఛైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో 36 పీఏసీఎస్ సంఘాలు ఉండగా 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం పూర్తయింది. వీరు వచ్చే ఏడాది జూలై 30వ తేదీ వరకు కొనసాగుతారు. ఒక పీఏసీఎస్ సంఘానికి ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించారు.