News October 29, 2024

HYD: BRS కార్యకర్తలకు KTR కీలక సూచనలు

image

BRS కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఈరోజు HYDలో కీలక సూచనలు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్, BJP, TDP వారి పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ BRSను టార్గెట్ చేస్తాయని వెల్లడించారు. తప్పుడు కేసులు, డీప్ ఫేక్ టెక్నాలజీతో అసత్య ప్రచారం చేస్తారని, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 6 గ్యారంటీల అమలులో ఫెయిల్ అయినందుకు కాంగ్రెస్‌ను ప్రశ్నించాలన్నారు.

Similar News

News February 28, 2026

అవినీతి అనకొండల గుండెల్లో ACB ‘దడ’

image

సిటీలో లంచగొండి బాబుల ఆటలు ఇక సాగవు. 2025లో తెలంగాణ ACB ఏకంగా 199 కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 29.2% పెరుగుదల. ముఖ్యంగా GHMC పరిధిలో 2025 చివరి మూడు నెలల్లోనే గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 78 కేసులు నమోదయ్యాయి. మొత్తం 273 మందిని అరెస్ట్ చేయగా, అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ₹96.13 కోట్ల అక్రమ సంపాదనను ఏసీబీ బయటపెట్టింది.

News February 28, 2026

తొమ్మిదే నెలల్లో ‘ఫ్యూచర్ సిటీ’ నైటౌట్

image

హైదరాబాద్ రేంజ్ మారిపోతోంది బాబోయ్! 765 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’కి సర్కార్ డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. కేవలం 9 నెలల్లోనే పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని టెండర్లో స్పష్టం చేసింది. 56 గ్రామాలను కలుపుతూ గ్లోబల్ కంపెనీలు, యూనివర్సిటీలే లక్ష్యంగా ఈ నగరం నిర్మిస్తున్నారు. కాలుష్యం లేని నెట్-జీరో పద్ధతిలో అద్భుత నగరం మన కళ్లముందే సాక్షాత్కరించబోతోంది.

News February 28, 2026

HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ స్కెచ్

image

HYD దాహార్తిని తీర్చేందుకు సర్కార్ అదిరిపోయే స్కెచ్ వేసింది. నియోపోలిస్ ఎత్తు ప్రాంతాన్ని వాడుకొని పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీళ్లందించేలా పక్కా ప్లాన్ రెడీ చేసింది. కొండపై భారీ రిజర్వాయర్లు కట్టి.. అక్కడి నుంచి మెహదీపట్నం, షేక్‌పేట, బోజగుట్టలకు గోదావరి జలాలను పారించనున్నారు. పంపింగ్ అవసరం లేకపోవడంతో జలమండలికి కోట్లాది రూపాయల కరెంటు బిల్లులు ఆదా కానున్నాయి. నగరవాసుల నీటి కష్టాలు తీరనున్నాయి.