News March 25, 2024
HYD: BRS చతికిల పడింది: ఎంపీ

అభివృద్ధికి పాటుపడతానని కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. HYD శేరిలింగంపల్లిలో ఇన్‌ఛార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. BRS పార్టీ చతికిల పడిందని అన్నారు. BJPని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
Similar News
News October 24, 2025
BREAKING: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 58 మంది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారంతో పూర్తయింది. మొత్తం 81 మంది అభ్యర్థుల నామినేషన్లు అధికారులు ఆమోదించగా. ఆఖరి రోజు 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థుల ఉపసంహరణ ఉంటుందని ఊహించినప్పటికీ చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. దీంతో ఒక్కో కేంద్రంలో నాలుగు ఈవీఎంలు ఉండే అవకాశం ఉంది.
News October 24, 2025
జూబ్లీ బైపోల్: మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి!

జూబ్లీ బైపోల్ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు ఓటర్లు తెలుసుకునేలా ECI అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ECINET మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉన్న ‘Know Your Candidate’ మాడ్యూల్ ద్వారా ఓటర్లు.. పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, కేసులు వంటి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఓటర్లు Android, iOSలో ECINET యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
SHARE IT
News October 24, 2025
జూబ్లీహిల్స్ బస్తీల్లో మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె బోరబండలోని సైట్ 3 ప్రాంతంలో పర్యటించి ఇంటింటికీ ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. రూ.కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు గుర్తు చేశారు.


