News October 22, 2024

HYD: BRS చేసిన అప్పులకు వడ్డీలతో సరిపోతుంది: TPCC చీఫ్

image

‘పంటల కొనుగోలు ఇంకా స్టార్ట్ కాలేదు.. ఇప్పుడే బోనస్ ప్రస్తావన ఎందుకు హరీశ్‌రావు గారూ.. మా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తుంది. మీరు చేసిన అప్పులకు మిత్తిలు, కట్టుకుంటూ రైతులకు ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తున్నాం’ అని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ వివరణ ఇచ్చారు. అందులో భాగంగానే రైతుబంధు, రుణమాఫీ, రైతు భరోసా ఇస్తున్నామన్నారు.

Similar News

News November 5, 2025

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక: ఓటేసిన 97 మంది

image

జూబ్లీహిల్స్‌లో మంగళవారం హోం ఓటింగ్‌కు మంచి స్పందన వచ్చింది. 97 మంది వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోం ఓటింగ్ కోసం మొత్తం 103 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 95 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం విశేషం. పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఈ స్ఫూర్తితోనే నవంబర్ 11న కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆశిద్దాం.

News November 5, 2025

HYD: కార్తీకపౌర్ణమి.. ఫేమస్ శివాలయాలు ఇవే!

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా HYD-ఉమ్మడి రంగారెడ్డిలోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. కీసరగుట్టతో పాటు సిటీ శివారులో ప్రఖ్యాతి, అతి పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆరుట్ల-బుగ్గ రామలింగేశ్వర స్వామి, యాచారం-నందీశ్వర, శంషాబాద్-సిద్ధేశ్వరాలయం, శంకర్‌పల్లి-మరకత శివలింగం, పాంబండ-రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. పాంబండ దక్షిణాసియాలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతంపైన ఉన్న ఆలయం. మీ ఏరియాలోని శివాలయం విశిష్టత ఏంటి?
SHARE IT

News November 5, 2025

క్యాబినెట్ మొత్తం జూబ్లిహిల్స్‌లోనే తిష్ట

image

ఇపుడు జరుగుతున్న ఉపఎన్నిక కేవలం ఒకే నియోజకవర్గంలో.. అయినా ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మొత్తం క్యాబినెట్ మంత్రులందరినీ అధిష్ఠానం రంగంలోకి దించింది. మంత్రులను బాధ్యులుగా చేశారు. క్యాబినెట్ మొత్తం జూబ్లీహిల్స్‌ను జల్లెడపడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ‘అమ్మా, అన్నా, అక్కా’ అంటూ మద్దతు కోరుతున్నారు. వీరితోపాటు నేరుగా సీఎం కూడా రంగంలోకి దిగారు.